దర్శి: దర్శి ఎంపీడీవో కార్యాలయంలో పోషన్ పక్వాడ కార్యక్రమం నిర్వహణ
Darsi, Prakasam | Apr 17, 2025 దర్శి మండలం కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం పౌష్టికాహార వారోత్సవాలు నిర్వహించారు. సీడీపీఓ భారతి మాట్లాడుతూ.. తల్లులు బిడ్డకు తన పాలు ఇవ్వడం వలన పిల్లలు ఆరోగ్యంగా, దృఢంగా, మానసికంగా ఎదుగుతారన్నారు. బాలింతలు, గర్భిణీలు క్రమం తప్పకుండా ఆకుకూరలు, గుడ్లను తినాలన్నారు. పౌష్టికాహారం తీసుకోవడం వలన రక్తహీనత సమస్య ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణారావు , అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.