యర్రగొండపాలెం: ప్రతి ఒక్కరూ యోగాని అలవాటు చేసుకుని ఒత్తిడిని అధిగమించాలని తెలిపిన ఎంపీడీవో శ్రీనివాసులు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో టిడిపి ఇన్చార్జి ఎరీక్షన్ బాబు ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలని ఒత్తిడిని అధిగమించి ఆరోగ్యాన్ని పొందాలన్నారు. కార్యక్రమంలో మండల అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.