తాడిపత్రి: మున్సిపల్ కీచక అధికారిని సస్పెండ్ చేయాలని తాడిపత్రి మున్సిపల్ కార్యాలయం వద్ద సీఐటీయూ నాయకులు ధర్నా
మున్సిపల్, సచివాలయ మహిళా ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తున్న కీచక మున్సిపల్ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ తాడిపత్రి మున్సిపల్ కార్యాలయం వద్ద బుధవారం సీఐటీయూ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నరసింహారెడ్డి, నాగభూషణం, ఉమా గౌడ్ లు మాట్లాడారు. మున్సిపల్ ఉన్నతాధికారి సచివాలయ, మున్సిపల్ మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతోపాటు తోపాటు వేధింపులకు గురి చేస్తున్నాడన్నారు. వెంటనే విచారణ చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.