మార్కాపురం: కొనకనమిట్ల మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలం చిన్నారి కట్ల సిద్ధవరం నాగరాజు కుంట గ్రామాలలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలోని టిడిపి నాయకులకు కార్యకర్తలకు సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... చిన్నారి కట్ల పెద్దారికట్ల గ్రామాల ప్రజల దాహార్తి తీర్చడానికి 55 కోట్ల రూపాయలతో పైప్ లైన్ నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో ఎప్పుడైనా ప్రజలను పట్టించుకున్నారా అని ప్రశ్నించారు