రాయదుర్గం: రైతుల కోసం జైలుకు వెళ్ళడానికైనా సిద్ధం : మాజీ ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి
అన్యాయంపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా? రైతుల కోసం తాను జైలుకైనా సిద్ధమని మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాపు రామచంద్రారెడ్డి అన్నారు. రాయదుర్గం పట్టణంలోని బళ్ళారి రోడ్డులో రాత్రి వేళల్లో నడుపుతున్న హోల్ సేల్ కూరగాయల మార్కెట్ లో జరిగిన ఘటనపై ఆయన విడియో విడుదల చేశారు. రైతులను రాత్రంతా పడిగాపులు పెట్టిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా అధిక టోల్ గేట్ రుసుం వసూలు చేస్తున్నారని ద్వజమెత్తారు. దీనిపై ప్రశ్నిస్తే దౌర్జన్యం చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఇక నుంచి రాయదుర్గం నియోజకవర్గంలో ఎవరికి అన్యాయం జరిగినా తాను అండగా నిలబడతానని వారికోసం జైలుకు వెళ్ళడానికైనా సిద్ధం అని స్ప