దర్శి: తాళ్లూరు మండలం రాజా నగర్ లో గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల వద్ద రైతులు ఆందోళన
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం రాజానగరంలో గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. పంట పొలాలకు వెళ్లే దారిని పూర్తిగా మూసివేస్తున్నారని ఆందోళనకు దిగారు. కనీసం అండర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. 200 ఎకరాల పంట పొలాలకు వెళ్లాలంటే చుట్టూ తిరిగి రావాల్సి వస్తుందని వాపోయారు. అధికారులకు పలుమార్లు చెప్పిన పట్టించుకోలేదని ఆరోపించారు.