రాయదుర్గం: నియోజకవర్గంలోని పలు చెరువుల వద్ద జలధార అవగాహన సదస్సు నిర్వహించిన అధికారులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార కార్యక్రమంలో బాగంగా నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత గురించి రాయదుర్గం మండలంలోని వేపరాళ్ల చెరువు, గుమ్మగట్ట మండలంలోని గౌనికుంట చెరువు, డి.హిరేహాల్ మండలం, దొడగట్ట చెరువుల వద్ద సోమవారం సదస్సులు నిర్వహించారు. ఇన్చార్జ్ డిఎల్డిఓ రాయదుర్గం ఎంపిడిఓ కొండన్న, ఆయా డి.హిరేహాల్ ఎంపీడీవో దాసా నాయక్, సాగునీటి శాఖ ఏఈఈ నసీర్, తెలుగుదేశం మండల కన్వీనర్ లు కాదలూరు మోహన్ రెడ్డి, కాలువ సన్నన్న, కురుబ హనుమంతు పాల్గొని అవగాహన కల్పించారు. భవిష్యత్తులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రతీ నీటి బొట్టునూ నిలుపుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.