గిద్దలూరు: కంభం మండలంలో బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం, విద్యుత్ సరఫరాకు అంతరాయం, వాతావరణం చల్లబడటంతో ఉపశమనం
మార్కాపురం జిల్లా కంభం మండలంలో ఆదివారం బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు తీవ్ర ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. అకస్మాత్తుగా వాతావరణ మార్పు చోటుచేసుకుని గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. విద్యుత్ సరఫరాకు ఈదురు గాలుల వల్ల అంతరాయం ఏర్పడింది. పగటిపూట ఉష్ణోగ్రతలు అమంతం పెరిగిపోవడం సాయంత్రం అయ్యేసరికి వర్షం పడడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.