గూడూరు లో మున్సిపల్ ఔట్ సోర్సింగ్ మహిళా కార్మికురాలికి ఘనంగా సన్మానం
తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ లో ఎన్నో సంవత్సరాలుగా ఔట్ సోర్సింగ్ పారిశుద్ధ్య మహిళా కార్మికురాలు గా ఐదవ సచివాలయం పరిధిలో విధులు నిర్వహిస్తున్న మందా రామమ్మ అక్టోబరు 31 తేదీన పదవి విరమణ కావడంతో ఏ.పీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సి.ఐ.టి.యు) అనుబంధం ఆధ్వర్యంలో తోటి పారిశుద్ధ్య కార్మికులు అందరూ కలిసికట్టుగా ఆదివారం రోజు స్థానిక సి.ఐ.టి.యు కార్యాలయం లో సన్మాన సభను భూలోక మురళి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.