మార్కాపురం: జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో విశాఖ ఉక్కు అగ్ని ప్రమాద బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని ఏఐటీయూసీ నాయకుల నిరసన
మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో విశాఖ ఉక్కు ప్రమాదంలో చనిపోయిన బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని ఏఐటీయూసీ నాయకులు నిరసన తెలియజేశారు. అనంతరం ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి కి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్ మాట్లాడుతూ జూన్ 8వ తేదీ విశాఖ ఉక్కు పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో పదిమంది ఉద్యోగ కార్మికులు చనిపోయారన్నారు. అగ్ని ప్రమాదంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మరియు కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలన్నారు. అదేవిధంగా కార్మిక కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.