గిద్దలూరు: పీఎం రిలీఫ్ ఫండ్ పేరుతో ఏపీకే ఫైల్స్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సీఎం రిలీఫ్ ఫండ్ పేరుతో వస్తున్న ఏపీకె ఫైల్స్ తో అప్రమత్తంగా ఉండాలని గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్ ప్రజలను హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసిన సీఐ ఏపీకె ఫైల్స్ ఎవరు ఓపెన్ చేయవద్దని తెలిపారు. అంతేకాకుండా సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి పీఎం రిలీఫ్ ఫండ్ పేరుతో అమాయక ప్రజలకు వలవేస్తున్నారని ఎవరు కూడా అటువంటి వాటిని నమ్మవద్దని కోరారు. ఎవరన్నా సైబర్ నేరకాల బారిన పడితే వెంటనే 1930 నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.