మార్కాపురం: జిల్లా కేంద్రంలో ప్రమాదవశాత్తు యువకుడు శ్రీనివాసరెడ్డి విద్యుత్ షాక్ తో మృతి
మార్కాపురం పట్టణంలోని ఎల్ఐసి కార్యాలయం సమీపంలో విద్యుత్ శాఖకు గురై యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. శివాజీ నగర్ కు చెందిన తంగిరాల శ్రీనివాసరెడ్డి టెంట్ హౌస్ లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పెళ్లి కార్యక్రమం కోసం లైటింగ్ పనులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు లవెన్ కె.వి హై టెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.