ఉరవకొండ: ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 88 శాతం జీతాలు, పెన్షన్లకే సరిపోతున్నది: ఉరవకొండలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 88 శాతం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకే సరిపోతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఉరవకొండలో బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆయన బడ్జెట్ ఔట్రీచ్ కార్యక్రమంలో మాట్లాడారు. వచ్చే ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయన్నారు. ఎక్సైజ్, రెవిన్యూ వంటి శాఖల నుంచి ఓ మోస్తరు ఆదాయం వస్తున్నదన్నారు. అధికారులు, ఉద్యోగులు బాధ్యతగా నడుచుకుంటేనే భవిష్యత్తు తరాలు బాగుంటాయన్నారు.