కొండపి: సింగరాయకొండ మండలం పాకాల సముద్రతీరంలో పర్యటకుల సందడి, అప్రమత్తంగా వ్యవహరించిన మెరైన్ పోలీసులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీరంలో ఆదివారం సందడి నెలకొంది. సెలవు రోజు కావడం అందులో కొంతవరకు వాతావరణం చల్లబడటం వంటి అంశాలలో ప్రజలు ఉపశమనం పొందేందుకు సముద్ర తీరానికి భారీగా తరలివచ్చారు. సముద్రంలో ఈత కొడుతూ సేద తీరారు. పర్యటకులు అత్యధికంగా వస్తుండడంతో మెరైన్ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగానే ఎప్పటికప్పుడు ఈత కొడుతున్న వారిని హెచ్చరించారు.