రాయదుర్గం: డి.హిరేహాల్ కు చెందిన నాగప్ప మిస్సింగ్, కేసు నమోదు
డి.హిరేహాల్ మండల కేంద్రానికి చెందిన టి. నాగప్ప (54) అదృశ్యమయ్యారు. నాగప్ప బళ్లారి సమీపంలో అలకుంది వద్ద అంగడి పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఈనెల 23 వ తేదీన రాత్రి సమయంలో ఇంటినుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాలలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో డి.హిరేహాల్ పోలీసులను ఆశ్రయించారు. నాగప్ప బార్య లక్ష్మి ఇచ్చిన పిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి తెలిపారు. అతని ఆచూకీ తెలిస్తే 9490109174 కు పోన్ చేయాలని కోరారు.