గిద్దలూరు: గిద్దలూరులో విఆర్ఓ ఆత్మహత్యపై ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసన తెలిపిన వీఆర్వోలు, పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్
మార్కాపురం జిల్లా గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్వోల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్వో సంఘం జిల్లా అధ్యక్షుడు వై.పీ. రంగయ్య మాట్లాడుతూ, కర్నూలు పట్టణానికి చెందిన సచివాలయ వీఆర్వో మహమ్మద్ హుస్సేన్ పని ఒత్తిడి, అధికారుల వేధింపులు భరించలేక ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఘటన అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోలు ఆందోళనలు చేపడుతున్నట్లు తెలిపారు. వీఆర్వోలపై రోజురోజుకు పనిభారం పెరుగుతోందని, తగిన సిబ్బంది లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.