రాయదుర్గం: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతీఒక్కరూ మొక్కలు నాటాలి : ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు
పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శుక్రవారం రాయదుర్గం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి 14వ వార్డు డ్రైవర్స్ కాలనీ సచివాలయం వరకు సైకిల్ పై ర్యాలీగా వెళ్లారు. అనంతరం అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రామకృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు బండి కృష్ణమూర్తి, పద్మశాలి కార్పోరేషన్ డైరెక్టర్ పొరాళ్ల పురుషోత్తం, సీనియర్ నాయకులు పూజారి శివ, కడ్డిపూడి మహబూబ్ బాషా, కేడిమి తిప్పేస్వామి, వేణు, కావలి రవి, దాసరిసత్తి పాల్గొన్నారు.