కొండపి: కొత్తపట్నం, సింగరాయకొండ పాకాల సముద్ర తీరాలను జూన్ 15వ తేదీ వరకు చేపల వేటని నిషేధిస్తూ అధికారులు ఆదేశాలు
ప్రకాశం జిల్లా కొత్తపట్నం, సింగరాయకొండ, పాకాల ప్రాంతాలలోని సముద్ర తీరంలో జూన్ 14వ తేదీ వరకు చేపల వేట నిషేధిస్తున్నట్లు మత్స్య శాఖ అధికారులు తెలిపారు. నిషేధ సమయంలో నెలకు రూ.20 వేలు జాలర్లకు జీవనభృతి ఇవ్వడం జరుగుతుందని ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారి లైసెన్స్ రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు. చేపలు సంతాన ఉత్పత్తి కోసం గుడ్లు పెడతాయని ఆ గుడ్లు విచ్ఛిన్నం కాకుండా ఈ నిషేధం విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు.