గిద్దలూరు: బేస్తవారిపేటలో జరిగిన P4 కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ విజయ సునీత, స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా బేస్తవారిపేట పట్టణంలో మంగళవారం P4 కుటుంబాల సమావేశ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి కలెక్టర్ విజయశాంతితో పాటు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి హాజరయ్యారు. మండలంలో 716 పేద కుటుంబాలను గుర్తించి సైంట్ ఫౌండేషన్ సంస్థ ద్వారా ఆ కుటుంబాలకు ఆర్థిక బలం చేకూర్చడం జరుగుతుందని కలెక్టర్ విజయ సునీత అన్నారు. పేద కుటుంబాలకు సహాయాన్ని అందించేందుకే సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఫౌండేషన్ చైర్మన్ మోహన్ రెడ్డిని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అభినందించారు.