రాయదుర్గం: కణేకల్లు లో విద్యుత్ కోతలు భరించలేక సబ్ స్టేషన్ ముట్టడి
కనేకల్ లోని బస్టాండ్ ఏరియాలో విద్యుత్ సరఫరా లేక స్థానికులు బిక్కుబిక్కుమంటూ రాత్రంతా చీకటిలో గడిపారు. గురువారం సాయంత్రం 6 గంటల పోయిన కరెంట్ తెల్లవారుజాము వరకూ కూడా రాకపోవడంతో విసిగిపోయిన ప్రజలు విద్యుత్ సబ్ స్టేషన్ ముట్టడించారు. లైన్ మెన్ పట్టించుకోవడం లేదని సిబ్బంది తో వాగ్వాదానికి దిగారు. విద్యుత్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.