గిద్దలూరు: గిద్దలూరు సమీపంలోని రైల్వే ట్రాక్ పై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్న యువకుడు, విచారణ చేపట్టిన పోలీసులు
మార్కాపురం జిల్లా గిద్దలూరు సమీపంలో రైల్వే ట్రాక్పై ఓ యువకుడు తలపెట్టి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం జరిగింది. పొదలకంటపల్లి గ్రామానికి చెందిన యువకుడు మొబైల్ ఫోన్ దొంగిలించడంతో తండ్రి మందలించాడు. దీంతో మనస్థాపం చెందిన యువకుడు బుధవారం ఇంటి నుంచి బయటకు వచ్చేసాడు. అయితే కుటుంబ సభ్యులు వెతుకుతుండగా గురువారం గిద్దలూరు సమీపంలోని రైల్వే ట్రాక్పై మృతి చెంది కనిపించాడు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.