తాడిపత్రి: తాడిపత్రిని టెంపుల్ సిటీగా చేయండి: యాడికి లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు విన్నవించిన జేసీ ప్రభాకర్ రెడ్డి
తాడిపత్రి టెంపుల్ సిటీగా చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి విన్నవించారు. యాడికిలో సోమవారం జరిగిన జలధార కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా తాడిపత్రిలోని పురాతన ఆలయాల విశిష్టతపై జేసీ ప్రభాకర్ రెడ్డి స్టాల్స్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వాటిని వీక్షించారు. ఈ సందర్భంగా జే సీ ప్రభాకర్ రెడ్డి తన కుమారుడి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, అన్న కుమారుడు జేసీ పవన్ కుమార్ రెడ్డితో కలిసి సీఎంకు విన్నవించారు. సీఎం సానుకూలంగా స్పందించారు.