కొండపి: టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలో ఢీకొన్న కంటైనర్ లారీలు, ట్రాఫిక్కు అంతరాయం, సరిదిద్దున పోలీసులు
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం టోల్ గేటు సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సామర్లకోట నుంచి టంగుటూరులోని రొయ్యల ఫ్యాక్టరీకి వస్తున్న కంటైనర్ను చెన్నై వైపు వెళుతున్న మరొక లారీ లారీ దాన్ని ఢీకొట్టాడు. దీంతో అక్కడ కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ట్రాఫిక్ను హైవే సిబ్బంది వెంటనే క్లియర్ చేశారు. ప్రస్తుతం ట్రాఫిక్ యథావిధిగా నడుస్తోంది.