రాయదుర్గం: పెట్రోలు డీజిల్ పెంపును నిరసిస్తూ పట్టణంలో వామపక్షాల నిరసన
పెట్రోలు డీజిల్ ధరలు పెంపును నిరసిస్తూ రాయదుర్గం పట్టణంలోని వినాయక కూడలిలో వామపక్ష పార్టీల నాయకులు నిరసన చేపట్టారు. దేశవ్యాప్త పిలుపులో బాగంగా మంగళవారం సాయంత్రం సిపిఐ, సిపిఎం నాయకులు నాగార్జున, నాగరాజు, మల్లికార్జున, అంజనేయులు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. తక్షణమే పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.