యర్రగొండపాలెం: పెద్దారవీడు మండలం వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులలో మొదలైన ఆందోళన
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలైన నిర్వాసితులలో ఆందోళన మొదలైంది. నిర్వాసితులుగా గుర్తించడంలో అవకతవకలు జరిగాయని కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగిన న్యాయం జరగలేదని మదన పడుతున్నారు. అర్హత ఉండి లబ్ది పొందని సుమారు 14 వందల మంది నిర్వాసితులు ఉన్నట్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నిర్వాసితులకు 906 కోట్లు ప్రభుత్వం మంజూరు చేయడంతో వారిలో మరింత ఆందోళన మొదలైంది.