దర్శి: మారెళ్ళ గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో శ్రీదేవి
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని మారెళ్ళ గ్రామంలో ఉపాధి హామీ పనులను ఎంపీడీవో శ్రీదేవి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ పనుల్లో పాల్గొంటున్న కార్మికుల హాజరును స్వయంగా తనిఖీ చేశారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఫేసియల్ అటెండెన్స్ విధానంపై కార్మికులతో మాట్లాడి దానిలో ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయా అనే విషయాన్ని తెలుసుకున్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వేణు ఫీల్డ్ అసిస్టెంట్ బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.