దర్శి: పెండింగులో ఉన్న కార్మికుల వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరిన ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి హనుమంతరావు
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ఆర్డబ్ల్యూఎస్ సబ్ డివిజన్ కార్యాలయం ముందు ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అనుమంతరావు ఆధ్వర్యంలో కార్మికుల పెండింగ్ వేతనాలను చెల్లించాలని నిరసన తెలిపారు. అనంతరం డి ఈ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అనుమంతరావు మాట్లాడుతూ కాంట్రాక్ట్ లో పని చేస్తున్న కార్మికులకు సుమారు 8 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆదివారం లోపు సమస్యలను పరిష్కరించాలన్నారు. పరిష్కరించకపోతే సోమవారం నుండి నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నట్లు పిలుపునిచ్చారు.