కొండపి: పొన్నలూరు మండలం ముప్పాల గ్రామంలో పేకాట ఆడుతున్న ఐదు మందిని అదుపులోకి తీసుకున్న స్థానిక పోలీసులు
ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం ముప్పాల గ్రామంలో బుధవారం పేకాట ఆడుతున్న ఐదు మందిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారిని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించి వారిపై కేసు నమోదు చేశామని అలానే వారి వద్ద నుంచి రూ.2,190 నగదు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. పేకాట ఆడుతున్నట్లు ఎవరైనా గుర్తిస్తే 112 నంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.