మార్కాపురం: విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయుల కృషి ఎనలేనిదని పేర్కొన్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు తెలియజేసి ప్రోత్సహించాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయుల కృషి ఎనలేనిది అన్నారు. జిల్లా అభివృద్ధికి ఉపాధ్యాయులు సూచనలు సలహాలు ఇవ్వాలన్నారు. అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామన్నారు