రాయదుర్గం: పట్టణంలో ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలు
రాయదుర్గం పట్టణంలో సినీనటుడు, సూపర్ స్టార్ కృష్ణ 84వ జయంతి వేడుకలను ఆదివారం ఆయన అభిమానులు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఘట్టమనేని ఫ్యామిలీ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. గౌరీశంకర్, మేస్త్రీ గనిగేరి నాగరాజు ఆధ్వర్యంలో అంబేడ్కర్ నగర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. సినీ రంగానికి కృష్ణ చేసిన సేవలను కొనియాడారు. అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభిమానులు గోపి, మహేష్, రమేష్, సుధీర్, కృష్ణతో పాటు పలువురు యువకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.