మార్కాపురం: ఆత్మహత్య చేసుకోబోతున్న ఓ వ్యక్తిని గుర్తించి కాపాడిన మార్కాపురం పోలీసులు
మార్కాపురం రైల్వే స్టేషన్ వంతెన వద్ద ఒక యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. చనిపోతున్నాం అన్న విషయాన్ని మార్కాపురం టౌన్ ఎస్సై కి ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. స్పందించిన ఎస్ఐ వెంటనే సంబంధిత సిబ్బందిని అప్రమత్తం చేశారు. టెక్నాలజీ ఉపయోగించి రైల్వే స్టేషన్ వంతెన వద్ద ఆ వ్యక్తి ఉన్నట్లు గుర్తించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు.