మార్కాపురం: పది రోజులలో నాలుగుసార్లు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు, సోమవారం ఉదయం 6 గంటల్లో నుండి అమలు
దేశవ్యాప్తంగా వాహనదారులకు పెట్రోల్ డీజిల్ రేట్లు భారీగా పెరగడంతో షాక్ తగిలింది. పెరిగిన ధరలు సోమవారం ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వచ్చాయి. 10 రోజుల వ్యవధిలోనే మే 15, 19, 23, 25 నాలుగుసార్లు ఇంధన ధరలు పెరిగాయి. మార్కాపురం జిల్లా కేంద్రంలో ఇవాళ పెట్రోల్ 117.68 పైసలు, డీజిల్ 105.33 పైసలు ధరలు ఉన్నాయి. పది రోజుల వ్యవధిలో పెట్రోలు లీటరుకు 7.34 పైసలు డీజల్ లీటర్కు 7.45 పైసలు పెరిగినట్లుగా వాహనదారులు అన్నారు.