రాయదుర్గం: ఎర్రంపల్లిలో పొలాల మద్య క్షుద్ర పూజల కలకలం
గుమ్మగట్ట మండలం ఎర్రంపల్లిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. అర్ధరాత్రి వేళ గ్రామశివారులో ఉన్న భువనేశ్వర్, అంగడి కిషోర్ పొలాల మద్య గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గు వేసి పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, ఎముకలు వేసి నల్ల కోడిని బలి ఇచ్చి క్షుద్ర పూజలు చేసిన విషయం సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఈ దృశ్యం చూసిన రైతులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పొలాలకు వెళ్ళేందుకు జంకుతున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.