యర్రగొండపాలెం: కొమరోలు గ్రామంలో ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం కొమరోలు గ్రామంలో ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైసీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేపీ కొండారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎంతోమంది సీటు కోసం ఆశిస్తున్నారని, యువకుడు మంచి వ్యక్తి చంద్రశేఖర్ ను ఆదరించాలని కోరారు.