కళ్యాణదుర్గం: కైరేవులో గంగాధర్ అనే రైతు పొలంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్, కాలిపోయిన డ్రిప్ పరికరాలు, విచారణ చేపట్టిన పోలీసులు
సెట్టూరు మండలం కైరేవు గ్రామంలోని గంగాధర్ అనే రైతుకు చెందిన పొలంలో సోమవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. మంటలు చెలరేగాయి. మంటలు ఆర్పడానికి స్థానికులు శతవిధాల ప్రయత్నించారు. మంటలు అదుపులోకి రాలేదు. డ్రిప్ పరికరాలన్నీ కాలిపోయాయి. డ్రిప్ పరికరాలతో పాటు ఇతర వ్యవసాయ పనిముట్లు కూడా కాలిపోయాయి. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.