మార్కాపురం: చెరువు సప్లై ఛానల్ లో చెత్తాచెదారం వేస్తే 5000 రూపాయలు జరిమానా విధిస్తామని కమిషనర్ నారాయణరావు హెచ్చరిక
మార్కాపురం చిన్న బ్రిడ్జి చెరువు సప్లై ఛానల్ లో చెత్తాచెదారం వేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియజేశారు. దీంతో కమిషనర్ నారాయణరావు ఇక్కడ సీసీటీవీ పర్యవేక్షణ ఉందని ఎవరైనా చెత్త వేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. చెత్త వేసిన వారికి 5000 రూపాయలు జరిమానా విధిస్తామన్నారు. మన పట్టణాభివృద్ధి మనందరి బాధ్యత అని సూచించారు