దర్శి: దర్శి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జూన్ 16వ తేదీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపిన ప్రిన్సిపాల్ ప్రభుదాసు
Darsi, Prakasam | Jun 11, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జూన్ 16వ తేదీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రభుదాసు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఇది చక్కని అవకాశం అని ఈ అవకాశాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు వయసు కలిగిన వారికి ఈ అవకాశం ఉంటుందన్నారు.