యర్రగొండపాలెం: త్రిపురాంతకం జడ్పీహెచ్ పాఠశాలలో ఉపాధ్యాయులు శామ్యూల్ పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు జాన్ శామ్యూల్ పదవి విరమణ సన్మాన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శామ్యూల్ తమ సేవా కాలంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ క్రమశిక్షణతో పాటు విలువలను బోధించి గొప్ప గురువుగా నిలిచారని అన్నారు. రిటైర్మెంట్ అయినప్పటికీ విద్యారంగానికి ఆయన చేసిన సేవలు ఆదర్శమని అన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ సభ్యులు గౌతమ్ రాజు రామంజమ్మ తదితరులు పాల్గొన్నారు.