మార్కాపురం: జిల్లాలో ఇన్చార్జి అధికారుల తోటే పాలన సాగిస్తున్నారని విమర్శించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా
మార్కాపురం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఏర్పాటు చేశారు కానీ ఇంతవరకు పూర్తిస్థాయిలో జిల్లా అధికారులను కేటాయించలేదన్నారు. జిల్లాలోని వివిధ శాఖలకు ఇన్చార్జి అధికారులతో పరిపాలన సాగిస్తున్నారన్నారు. వెనకబడిన ప్రాంతం నూతనంగా ఏర్పడిన జిల్లాకు ప్రభుత్వం ఎందుకు చిన్నచూపు చూస్తుందో తెలియటం లేదన్నారు. జిల్లా ఏర్పడిన తర్వాత భూకబ్జాలు పెరిగిపోయాయి అన్నారు. రేషన్ మాఫియా సాగుతుందని డీలర్లు బియ్యం ఇచ్చే పరిస్థితుల్లో లేరన్నారు.