యర్రగొండపాలెం: పిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ప్రమాదాలపై అవగాహన కల్పించాలని హెచ్చరించిన పోలీసులు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం బోయలపల్లి గ్రామంలోని పంట పొలాల్లో ఉన్న నీటి కుంటలో ఇద్దరు పిల్లలు పడి చనిపోయిన విషయం తెలిసినదే. పిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని పోలీస్ అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు. నిర్లక్ష్యం వహించడం వల్ల పిల్లలను కోల్పోయిన పరిస్థితి ఏర్పడిందని వారన్నారు. ఇప్పటికైనా వేసవి సెలవులు వస్తున్న సందర్భంగా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, ప్రమాదాలపై అవగాహన కల్పించాలని పోలీస్ అధికారులు మండలంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.