రాయదుర్గం: రెడ్డి యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కణేకల్లు లో ఉచిత మెగా వైద్య శిబిరం, అనూహ్య స్పందన
కణేకల్లు మండల కేంద్రంలోని చిక్కణ్ణేశ్వర స్వామి ఫంక్షన్ హాల్ లో ఆదివారం రెడ్డి యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ముందుగా హేమారెడ్డి మల్లమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలకు వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉచిత వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయించేందుకు చర్యలు తీసుకున్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో రెడ్డి యువజన సంక్షేమ సంఘం నాయకులు చేపడుతున్న సేవా కార్యక్రమాలపై స్థానికులు హర్షం వ్యక్తం చేసి అభినందించారు.