గిద్దలూరు: గిద్దలూరులో ఈనెల 27వ తేదీన సీఎం చంద్రబాబు పర్యటన, ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు ప్రజాప్రతినిధులు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈనెల 27వ తేదీన మార్కాపురం జిల్లా గిద్దలూరులో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లు అధికారులు వేగవంతం చేశారు. కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, కలెక్టర్ విజయ సునీత, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు పరిశీలించారు. హెలిపాడ్, సభా ప్రాంగణం సందర్శించి త్వరగా ఏర్పాట్లు పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. గిద్దలూరు మండలం క్రిష్టం శెట్టిపల్లి గ్రామంలో సంజీవిని వైద్యశాల ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు వస్తున్నారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని కలెక్టర్ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.