మార్కాపురం: మార్కాపురం లోని ఓ హోటల్ పై పోలీసులు దాడి, పేకాట ఆడుతున్న 17 మంది అరెస్ట్
మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్లో డిస్టిక్ టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ కోటి నాయక్ సమాచారం మేరకు మార్కాపురం రూరల్ ఎస్సై, అర్ధవీడు ఎస్ఐ, సిబ్బందితో పేకాట శిబిరం పై దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాటాడుతున్న 17 మందిని అదుపులో తీసుకొని వారి వద్ద ఉన్న 63,750 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెడుతున్నట్లు పోలీసులు తెలిపారు.