యర్రగొండపాలెం: రామచంద్రపురం గ్రామంలో నూతన పాస్ పుస్తకాలను రైతులకు అందజేసిన ఎమ్మార్వో విజయభాస్కర్
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం రామచంద్రపురం గ్రామంలో రైతులకు నూతన పాస్ పుస్తకాలను ఇన్చార్జి ఎమ్మార్వో విజయభాస్కర్ అందజేశారు. రీ సర్వేలో రైతుల భూములకు ప్రభుత్వ రాజముద్రతో నూతన పుస్తకాలను అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. రీ సర్వేలో పొరపాట్లు జరిగి ఉంటే రైతులు తమ సమస్యను అర్జీ రూపంలో తెలియజేయాలని వాటిని సరి చేయడం జరుగుతుందన్నారు. రెవెన్యూ అధికారులకు సహకరించాలని కోరారు.