గిద్దలూరు: కంభంలో పెళ్లి బృందాన్ని ఢీకొట్టిన లారీ, నలుగురు మృతి,దిబ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, ఆదుకుంటామని వెల్లడి
మార్కాపురం జిల్లా కంభం పట్టణంలో పెళ్లి బృందాన్ని శుక్రవారం లారీ ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందగా ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఊరిలో లేకపోవడం వల్ల ఆయన సోదరుడు కృష్ణ కిషోర్ రెడ్డిని ఆసుపత్రికి పంపి బాధిత కుటుంబాలను పరామర్శింపజేశారు. వెంటనే తక్షణ సహాయం కింద వారికి 50 వేల రూపాయలు అందజేశారు. విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు న్యాయం చేస్తానని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు.