యర్రగొండపాలెం: దోర్నాల మండలంలోని టోల్ ప్లాజాకు హసనాబాద్ పేరు పెట్టాలని కోర్టు ఆదేశాలు
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం లోని కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై నిర్మిస్తున్న టోల్ ప్లాజా పేరు వివాదానికి కీలక మలుపు తిరిగింది. టోల్ ప్లాజా కు అసనాబాద్ టోల్ ప్లాజా అనే పేరు పెట్టాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. గత కొంతకాలంగా ఆసనాబాదు జమ్మి దోర్నాల గ్రామాల మధ్య పేరు విషయంలో వివాదం కొనసాగుతున్న విషయం తెలిసినదే. కోర్టు తాజా ఆదేశాలతో హసనాబాద్ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు.