రాయదుర్గం: 156 మంది బాలలకు ఉచిత ఖత్నా చేయించిన అంజుమన్ అజ్మతుల్ ఇస్లాం కమిటీ
రాయదుర్గంలో అంజుమన్ అజ్మతుల్ ఇస్లాం కమిటీ ఆధ్వర్యంలో 156 మంది బాలలకు ఉచిత ఖత్నా(సున్తీ) నిర్వహించారు. ఆదివారం ఉదయం నుంచి ప్రత్యేక వైద్య నిపుణులు అతావుర్ రహమాన్, మూసా ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆ సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు బ్రెడ్ షర్మాస్, మహమ్మద్ షఫీ తెలియజేశారు. నిత్యావసర సరుకులతో కూడిన కిట్‌లను కూడా వారికి పంపిణీ చేశామన్నారు. సహాయ కార్యదర్శి హుజేఫా, కోశాధికారి అహ్మద్ హుస్సేన్, కమిటీ సభ్యులు ఖాసిం, షాకీర్, ఉమర్ అలీ, షేక్ జాకీర్, రజాక్, భాష తదితరులు పాల్గొన్నారు.