కొండపి: మర్రిపూడి మండలం జువ్విగుంట గ్రామంలో పనిచేయని ఎయిర్టెల్ మొబైల్ నెట్వర్క్, తీవ్ర అవస్థలు పడుతున్న స్థానిక ప్రజలు
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం లో మొబైల్ ఫోన్లు మూగబోయాయి. జువ్విగుంట గ్రామంలోని ఎయిర్టెల్ నెట్వర్క్ టవర్ సరిగా పనిచేయకపోవడం వల్ల రెండు రోజుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు బుధవారం స్థానిక ప్రజలు తెలిపారు. అత్యవసర సమయంలో కమ్యూనికేషన్ చేసుకునేందుకు అవస్థలు పడుతున్నామని ప్రజలు అన్నారు. వెంటనే సంబంధిత అధికారులు పట్టించుకోని నెట్వర్క్ సరిగా పనిచేసేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.