గిద్దలూరు: బేస్తవారిపేట మండలం గలిజరగుళ్ల గ్రామంలో బలమైన ఈదురుగాలులకు నేలకొరిగిన ధ్వజస్తంభం
మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలం గలిజరగుళ్ల గ్రామంలో శుక్రవారం శ్రీ పట్టాభి రామస్వామి దేవాలయం ధ్వజస్తంభం నేలకొరిగింది. శుక్రవారం తెల్లవారు జామున బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం కోరడంతో ధ్వజస్తంభం కూలిపోయినట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. ధ్వజస్తంభం కూలిపోయిన సందర్భంలో అక్కడ ప్రజలు ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పినట్లుగా గ్రామస్తులు తెలిపారు. ఇటీవలనే శ్రీ పట్టాభిరామస్వామి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ట జరిగినట్లు గ్రామస్తులు వెల్లడించారు.