మార్కాపురం: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు నిరసన
మార్కాపురం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మధ్యాహ్న భోజన పథకం సంఘం సిఐటియు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ విజయ సునీత కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు రఫీ మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తుందన్నారు. వివిధ పాఠశాలలో ఆరకొర జీతాలతో పనిచేస్తూ విద్యార్థులకు వేడివేడిగా భోజన సదుపాయం కల్పిస్తున్న కార్మికుల పొట్ట గొట్టే చర్యలను మానుకోవాలన్నారు. ఎన్నికల ముందు మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు జీతాలు పెంచుతాం అని చెప్పిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.